NGKL ఉప్పునుంతల మండలం జప్తిసదగోడుకి చెందిన ఆర్టీసీ మెకానిక్ గద్ద సహదేవ్ (46) అదృశ్యమయ్యారు. డిపోకు వెళ్తున్నానని చెప్పి బైక్‌పై వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఎస్సై పుట్ట మహేష్ గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే 8712657738, 8712665496కు సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
ఆర్టీసీ మెకానిక్ అదృశ్యం


