హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయస్థానంలో వినాయకుడి ప్రతిమల పంపిణీ

పెద్దపల్లి జిల్లా న్యాయస్థానంలో ఈరోజు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల గాయత స్కూల్ సౌజన్యంతో మట్టి వినాయకుడి ప్రతిమలను న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కక్షిదారులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆమె సూచించారు. డీసీపీ రామ్ రెడ్డి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ నిజ కోహిర్కర్ తదితరులు పాల్గొన్నారు.