హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIMS వైద్యులను అభినందించిన సీఎం

HYD: NIMSలో నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డిని వైద్యులు డి.రమణ ధన్నపునేని, ఎం.అమరేష్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు జరిగిన క్యాంపులో 19 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారు. రెండు నెలల పసికందుకు విజయవంతంగా సర్జరీ చేసిన వైద్యులను సీఎం అభినందించారు.