హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ యోగాసన పోటీలకు ఎంపిక

NZB: కరీంనగర్‌లో నిర్వహించిన 13వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్, యోగాసన ఛాంపియన్షిప్లో మహతి ఆశ్రమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 16-18 ఏళ్ల విభాగంలో జాదవ్ లావణ్య మూడో స్థానం సాధించి కాంస్య పతకం గెలుచుకుని జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపికైంది. మరో విద్యార్థిని ఇందు నాలుగో స్థానం సాధించి మెరిట్ సర్టిఫికెట్ పొందింది. యోగా గురువు అశోక్ అభినందించారు.