హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల జోరు

VZM: ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జనసేన పార్టీ నాయకురాలు గురాన రాధిక అయ్యలు దంపతులు కోరారు. స్థానిక RTC కాంప్లెక్స్, GSR హోటల్ వద్ద ఇవాళ వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాధిక మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు.