హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

MDK: రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు నర్సాపూర్, అల్లాదుర్గ్ కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఐదు బెంచ్‌ల ద్వారా జిల్లావ్యాప్తంగా 6,351 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్.ఎం. సుభవల్లి, సిరి సౌజన్య పాల్గొన్నారు.