KDP: స్థానిక సంస్థల ఎన్నికలు, పండుగల నేపథ్యంలో పెద్దపసుపుల గ్రామంలో శనివారం పోలీసులు మెగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసి ఫ్లాగ్ మార్చ్, ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దపసుపులలో పోలీసుల కార్డాన్ సెర్చ్


