హైదరాబాద్: 28°C
తెలంగాణ

గేదెను ఢీకొట్టి ఆటో బోల్తా

MDK నర్సాపూర్ మండలం గొల్లపల్లి వద్ద శనివారం రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపైకి సడన్‌గా వచ్చిన గేదెను ఆటో ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో వాహనం పాక్షికంగా దెబ్బతింది. రాత్రి వేళల్లో రహదారులపై పశువులు సంచరించకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.