హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్తీ తెల్లకల్లు విక్రయం కేసులో పది మంది అరెస్ట్

MNCL: మంచిర్యాల పట్టణంలో కల్తీ తెల్లకల్లు విక్రయిస్తున్న కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు CI ప్రమోద్ రావు శనివారం తెలిపారు. 2 రోజుల క్రితం నార్కోటిక్ బృందం స్థానిక పోలీసులతో కలిసి కల్లు దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ కేసులో కల్లు డిపోకు చెందిన వారితో పాటు కల్లు విక్రయిస్తున్న మరో 8మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.