హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన అన్వర్‌కు నివాళి

SRPT: ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన నాగారం మండలం శాంతినగర్‌కు చెందిన అన్వర్ పార్థివదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి గారు సందర్శించి నివాళులర్పించారు. ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అన్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.