హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ ఢీకొని మహిళ దుర్మరణం

ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి శివారులో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొనడంతో బడా భీమ్‌గల్‌కు చెందిన సుజాత (35) మృతి చెందారు. భర్త లింబాద్రితో కలిసి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ సుమలత తెలిపారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.