హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల రెన్యూవల్

PLD: జిల్లాలో 129 మద్యం దుకాణాలు, 13 కల్లుగీత దుకాణాలకు రెన్యూవల్‌ అవకాశం కల్పించినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి మణికంఠ తెలిపారు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని, రెన్యూవల్‌ కానివి 22 నుంచి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. సెప్టెంబర్‌ 30న లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామని అన్నారు.