హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధ్వాన్నంగా జగనన్న రహదారి

AKP: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్.రాయవరం మండలంలోని రోడ్లు అధ్వాన్నంగా మారాయి. గుండ్రుబిల్లి సమీపంలోని జగనన్న కాలనీ రహదారి బురదమయమై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిపై రాకపోకలు సాగించడానికి పలు అవస్థలు పడాల్సి వస్తుందని కాలనీవాసులు తెలిపారు. వర్షం పడితే కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.