NGKL: వినాయక చవితిని పురస్కరించుకుని వివాదాస్పద స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దని, డీజేలకు అనుమతి లేదని కల్వకుర్తి డివిజన్ డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 14 నుంచి జరిగే ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అత్యవసర వేళల్లో అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
వివాదాస్పద స్థలాల్లో మండపాలు వద్దు: DSP


