WNP: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ సూచించారు. గోపాల్‌పేట మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఆయన తనిఖీ చేశారు. యువత ఓటరుగా నమోదు అయ్యేలా అవగాహన కల్పించాలని BLOలను ఆదేశించారు. కొత్త నమోదుకు ఫారం-6, వివరాల సవరణకు ఫారం-8 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.
తెలంగాణ
'ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'


