హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం

ATP: ఆస్తి తగాదాలతో ముచ్చుకోటకు చెందిన మహిళ ఇద్దరు పిల్లలతో శింగనమల చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం అందుకున్న సీఐ రాగిరి రామయ్య, ఎస్సై ప్రసాద్ సిబ్బందితో చెరువు వద్దకు చేరుకుని ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి భోజనం పెట్టి, ఆత్మహత్య పరిష్కారం కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు.