హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులోనే సమగ్ర ప్రజారోగ్య పరీక్షలు

ASR: అరకు ఏరియా ఆసుపత్రిలో సమగ్ర ప్రజారోగ్య పరీక్షా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ, TDP అరకు ఇన్‌ఛార్జ్ డా. దొన్నుదొర శనివారం ప్రారంభించారు. ఇకపై వైద్య పరీక్షల కోసం పాడేరు, విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పరీక్షల నివేదికలను ఆన్‌లైన్‌లో నిపుణులకు పంపించి టెలీమెడిసిన్ ద్వారా వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. గిరిజనులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరమన్నారు.