హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ బస్సులలో తనిఖీ

విశాఖ APSRTC రీజనల్ మేనేజర్ బీ. అప్పలనాయుడు ఓల్డ్ గాజువాక నుంచి ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నడిచే 'ఏరో ఎక్స్‌ప్రెస్' బస్సులను తనిఖీ చేశారు. ప్రతి అరగంటకు ఒక సర్వీసు చొప్పున హైవే రూట్, బీచ్ రోడ్డు (ASR1, ASR2) మార్గాల్లో తిరిగే బస్సుల పనితీరును ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేలా చూడాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు.