హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమిష్టి కృషితో విజయవంతం చేయాలి: SP

ADB: గణపతి ఉత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో SP పాల్గొని మాట్లాడారు. గణపతి మండపాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ చేయాలన్నారు. డీజే, టపాకాయలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉత్సవాలు ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు.