హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పర్ బస్తీలో సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్

HYD: సీతాఫల్‌మండి కార్పొరేటర్ డాక్టర్ హేమ సమాల ఉప్పర్ బస్తీలో స్థానికులతో కలిసి పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త పేరుకుపోకుండా వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని GHMC అధికారులను కోరారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టి, ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని అధికారులను కోరారు.