MDK: ప్రమాదవశాత్తు చీరకు మంటలంటుకుని మహిళ మృతి చెందిన విషాద ఘటన పోతంశెట్టిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బ్రహ్మాండ్లపల్లి పారిజాత (50) శనివారం ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పారిజాత కేకలు విని స్థానికులు వచ్చేలోపే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కుమారుడు నరేష్ ఫిర్యాదుతో SI మోహినొద్దిన్ కేసు నమోదు చేశారు.
తెలంగాణ
చీరకు మంటలు.. మహిళ సజీవ దహనం


