SRD: ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే యూఎస్‌ఎఫ్‌ఏ (USFA) రాష్ట్ర ప్లీనరీ సమావేశాల పోస్టర్లను ఎమ్మెల్సీ కోదండరాం శనివారం ఆవిష్కరించారు. విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా ప్లీనరీలు సాగాలన్నారు. విద్యావ్యవస్థ మెరుగుదలకు ప్రభుత్వానికి తగిన సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యారంగ బలోపేతమే లక్ష్యం: కోదండరాం


