హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒక్క ఓటు కూడా పోకూడదు: తహశీల్దార్

NRPT: ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో నోటీసులు అందిన ఒక్క ఓటరు కూడా హక్కును కోల్పోకుండా BLOలు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలని తహశీల్దార్ అశోక్‌కుమార్ సూచించారు. ఉట్కూరు మండలం అమీన్‌పూర్, పగిడిమర్రి, ఓబులాపూర్ గ్రామాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.