ASF: వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన బండే తేజస్విని (26) బైక్ ప్రమాదంలో మృతి చెందింది. శనివారం ఆమె భర్త తిరుపతితో కలిసి బైక్‌పై బెల్లంపల్లి వెళ్తుండగా, గుండి ఎక్స్ రోడ్ ఫ్లై ఓవర్‌పై బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజస్వినిని చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు స్థానికులు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


