హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక డ్రా!

జనగామ జిల్లాలో ఘనపూర్, లింగాల ఘనపురం, జఫర్గడ్ అర్హులైన నిరుపేదలకు పారదర్శక పద్ధతిలో 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపిక డ్రాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ నిర్వహించారు. ఇందిరమ్మ L2 జాబితా, ప్రజావాణి, ప్రజాప్రతినిధుల సిఫార్సుల ఆధారంగా వీడియో చిత్రీకరణతో ఈ ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది కేటాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.