హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యం: సీపీ

SDPT: మహిళల భద్రత, సైబర్ నేరాలు, 112 యాప్‌పై అవగాహన పెంచాలని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ సూచించారు. మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. బాధితులతో ఓర్పు, సానుభూతితో వ్యవహరించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందించాలన్నారు. పాఠశాలల్లో ఆత్మరక్షణ శిక్షణను బలోపేతం చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఆదేశించారు.