హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఒకే గణపతి విగ్రహం

NLG: వినాయక చవితి వచ్చిందంటే చాలు గల్లికో వినాయక విగ్రహాలు ప్రత్యక్షమవుతాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం 40 ఏళ్లుగా ఒకే విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తున్నారు. అదే మాడ్గులపల్లి మండలం కేశవాపురం గ్రామం. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఒకే విగ్రహాన్ని పెట్టి, వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కువ విగ్రహాలు పెడితే ప్రజల మధ్య దూరం పెరుగుతుందని వారి నమ్మకం.