హైదరాబాద్: 28°C
తెలంగాణ

"పే స్కేల్, అలవెన్సులు పునరుద్ధరించాలి"

HNK: మెప్మా ఉద్యోగులకు పే స్కేల్‌తో పాటు అలవెన్సులు చెల్లించాలని ఉద్యోగులు MLA నాయిని రాజేందర్‌రెడ్డిని కోరారు. 2023 ఆగస్టు 11న జారీ చేసిన జీవో 157 ప్రకారం 2025 మార్చి వరకు వేతనాలు అందాయని తెలిపారు. ఏప్రిల్ 2025 నుంచి అలవెన్సులు నిలిపివేసి బేసిక్ పే మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను CM దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.