హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి'

MBNR: కౌకుంట్ల మండలం పేరూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో త్రీఫేస్ విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో పత్తి, వరి, మిరప, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిక్కుతోచని దుస్థితిలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల రైతులు శనివారం సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి హై వోల్టేజ్ విద్యుత్ సరఫరాను అందించాలని వారు డిమాండ్ చేశారు.