హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఐ లవ్ గుంటూరు’ లైటింగ్ బోర్డు ఏర్పాటు

గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ ప్రవేశ మార్గం వద్ద ‘ఐ లవ్ గుంటూరు’ లైటింగ్ బోర్డు ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం గాంధీ పార్క్‌ను సందర్శించిన కమిషనర్ పార్క్ పరిసరాలను పరిశీలించారు. జనసందోహం అధికంగా ఉండే ఆరు ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.