హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ గ్రామంలో 'నో' వినాయక చవితి.. ఎందుకంటే?

ATP: శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో దశాబ్దాలుగా వినాయక చవితి పండగను జరుపుకోరు. గ్రామదేవత మారెమ్మకు ప్రతి ఏటా శ్రావణమాసం చివర్లో జాతర నిర్వహిస్తారు. జాతరకు, వినాయక చవితికి మధ్య సమయం తక్కువగా ఉండటంతో.. గణపతి ఉత్సవాలు నిర్వహిస్తే గ్రామ పవిత్రతకు భంగం కలుగుతుందని స్థానికుల నమ్మకం. దీంతో పూర్వీకుల కాలం నుంచి గ్రామంలో వినాయక చవితికి దూరంగా ఉంటున్నారు.