ASR: ముంచంగిపుట్టు వారపు సంతలో శనివారం ఎస్సై పీ.నాని ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నాటుసారా, గంజాయి దుష్పరిణామాలు, మహిళల భద్రత, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అప్రమత్తతపై వివరించారు. వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటు, నిమజ్జనం, భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ముంచంగిపుట్టు వారపు సంతలో ఎస్సై అవగాహన


