హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎన్. ప్రేమలత

MBNR: జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత సూచించారు. రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్, సివిల్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని, లోక్ అదాలత్‌లో కుదిరిన రాజీ తీర్పుపై ఎలాంటి అప్పీల్ ఉండదని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్, జడ్చర్లతో పాటు దేవరకద్రలోనూ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.