హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలిగుంటకు సరఫరా కాని సాగునీరు

AKP: కోటవురట్ల (మం) నీలిగుంటకు తాండవ కాలువ నీరు రావడం లేదని రైతులు తెలిపారు. నీరు సరఫరా కాకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు కారణంగా రైతులు వరి పంట సాగు చేయడం లేదు. ప్రస్తుతం భీమరెడ్డిపాలెం వరకు మాత్రమే తాండవ కాలువ ద్వారా సాగునీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్‌లో తగినంత నీటి నిల్వలు లేని కారణంగా నీలిగుంటకు నీరు సరఫరా కావడం లేదని అధికారులు తెలిపారు.