హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవుల్లోకి గొర్రెలను తీసుకెళ్లొద్దు: ఎఫ్‌ఆర్వో

NGKL: కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలోకి గొర్రెలను తీసుకెళ్లవద్దని ఎఫ్‌ఆర్వో వాణి కుమారి హెచ్చరించారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం కావడంతో ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం అడవిలోకి ప్రవేశించడం నిషేధమన్నారు. అనుమతి లేకుండా అడవిలోకి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.