KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. బండ అశోక్ నేతృత్వంలో చేపట్టిన దీక్షను జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ సందర్శించారు. మొదటి విడతలో లబ్ధి పొందని వారికి, రెండో విడతలో అర్హులైన వారికి దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'దళిత బంధు నిధులు విడుదల చేయాలి'


