హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లిగూడెంలో ఒకేరోజు 582 కేసులు క్లియర్

W.G: తాడేపల్లిగూడెం కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 582 కేసులు పరిష్కారమైనట్లు 11వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి శనివారం తెలిపారు. ఇందులో 21 సివిల్, 122 క్రిమినల్, 24 ప్రీ లిటిగేషన్, 415 బెంచ్ కోర్టు కేసులు ఉన్నాయని చెప్పారు. న్యాయమూర్తులు కె.మాధవి, కె.లలిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పిరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.