హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదలకు మెరుగైన వైద్యం లక్ష్యం'

CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. సకాలంలో వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు ఈ ప్రయోగశాల ఉపయోగపడుతుందన్నారు.