హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

BDK: ఆళ్లపల్లి మండలం కాచనపల్లి నుంచి అనంతోగు వెళ్లే అటవీ మార్గంలో శనివారం ట్రాక్టర్ బోల్తా పడింది. రోంపేడు చెందిన ట్రాక్టర్ ఇటుకల లోడుతో వెళ్తుండగా, మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్‌లోని ఇటుకల లోడు చెల్లాచెదురైంది.