W.G: వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని SI వాసు సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాలు, నిమజ్జనం వద్ద డీజేలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. పందిళ్ల వద్ద విద్యుత్ దీపాలంకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి ఉత్సవాలకు డీజే అనుమతి లేదు'


