హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: సబ్‌ కలెక్టర్

అన్నమయ్య: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మదనపల్లె సబ్‌ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెడ్డప్ప నాయుడు కాలనీలో శనివారం ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. రసాయన రంగులు, పీవోపీ విగ్రహాలకు దూరంగా ఉండి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.