హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్రాందీ షాపుల కాలపరిమితి మరో ఏడాది పెంపు'

W.G: జిల్లాలోని 193 మద్యం దుకాణాలను ఏడాది పాటు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్బారావు తెలిపారు. లైసెన్స్ ఫీజులో 38 శాతం మొదట చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నాలుగు విడతల్లో కట్టాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు అమ్మినా, NDP మద్యం విక్రయించినా రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.