SDPT: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తొగుట ఏఈ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఎడ్లబండితో రాస్తారోకో నిర్వహించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 20 గంటల విద్యుత్ ఇవ్వాలని కోరుతూ ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
వ్యవసాయ విద్యుత్ కోతలపై నిరసన


