హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి BRS నాయకులు పరామర్శ

JN: చిల్పూర్ మండలంలోని చిల్పూర్ గ్రామానికి చెందిన గాదే రవి అనారోగ్యంతో మృతి చెందగా, బీఆర్‌ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేష్‌రెడ్డి శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు.