హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీ స్థలంపై ఆక్రమణ ఆరోపణలు'

NLR: గుడ్లూరులోని MSR కాలనీలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ యత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పునాదుల నిర్మాణంపై అంగన్వాడీ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు పనులు నిలిపివేశారు. అయితే శనివారం మళ్లీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.