హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కార్డుతో బియ్యం స్వాహా?

VKB: బంట్వారం మండలం సల్బత్తాపూర్‌ గ్రామానికి చెందిన మృతురాలు బాలమ్మ రేషన్‌ కార్డులో ఇతరుల పేర్లు చేర్చి రెండేళ్లుగా బియ్యం తీసుకుంటున్నారంటూ మనుమడు జనగామ వెంకటేష్‌ ఆరోపించారు. ఆన్‌లైన్‌లో వివరాలు పరిశీలించడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.