హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి గణేష్‌ల పంపిణీ

వరంగల్ నగరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఉచిత మట్టి వినాయక విగ్రహాలను శనివారం పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని సంఘం ప్రతినిధులు సూచించారు. రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించి జల కాలుష్యాన్ని నివారించాలని కోరారు.