హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ATP: శింగనమల కేజీబీవీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే బండారు శ్రావణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది, టాయిలెట్లు, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బోధన, భోజనంపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటర్ రూమ్ నిర్మాణానికి రూ. 18.50 లక్షల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.