హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కులాంతర వివాహ జంటకు రక్షణ కల్పించాలి'

GDWL: గద్వాల మండలం రేపల్లి గ్రామంలో బీసీ యువతి, దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారనే కక్షతో యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిని కూల్చివేశారని అంబేడ్కర్ యువజన సంఘం నేతలు ఆరోపించారు. శనివారం మక్తల్‌లో సమావేశం నిర్వహించి ఈ ఘటనను ఖండించారు. జంటకు పోలీస్ రక్షణ కల్పించాలని, బాధితుడికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.