హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులు పంపిణీ చేసిన కిరణ్ గౌడ్

జనగామ జిల్లాలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ గౌడ్, నేడు డీసీసీ అధ్యక్షురాలు ధనవంతుతో కలిసి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. గోపరాజుపల్లి, గానుగుపాడు, చౌడారం, జనగామ టౌన్‌లకు చెందిన నిరుపేదలకు మొత్తం రూ. 6,10,000 ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.